వరుస నష్టాలకు బ్రేక్... లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

  • కొనుగోళ్ల అండతో పుంజుకున్న సూచీలు
  • 498 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 166 పాయింట్ల వృద్ధి నమోదు చేసిన నిఫ్టీ 
భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. 498 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్ 78,540కు పెరిగింది. అదే బాటలో నిఫ్టీ కూడా 165 పాయింట్ల లాభంతో 23,753 వద్ద ముగిసింది. 

జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించాయి.

జొమాటో, మారుతి, నెస్లే ఇండియా, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.


More Telugu News