పుష్ప ‘పీలింగ్స్​’ పాటకు... లేడీ ప్రొఫెసర్​ అదిరిపోయే స్టెప్పులు... వైరల్​ వీడియో ఇదిగో!

  • జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప–2 సినిమా
  • అందులోని పీలింగ్స్ పాటకు స్టెప్పులు వేస్తూ అభిమానుల సందడి
  • అలా విద్యార్థులతో కలసి డ్యాన్స్ చేసిన లేడీ ప్రొఫెసర్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
పుష్ప–2 సినిమా జాతీయ స్థాయిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అందులోని పాటలకు అభిమానుల స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. అలా కొచిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ మైక్రో బయాలజీ మహిళా ప్రొఫెసర్ పార్వతి వేణు ఇటీవల విద్యార్థులతో కలసి ‘పీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు. విద్యార్థులతో పోటీ పడుతూ ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
  • ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోకు రెండు రోజుల్లోనే... లక్షల కొద్దీ వ్యూస్, ఆరున్నర లక్షలకుపైగా లైకులు వచ్చాయి. 
  • లేడీ ప్రొఫెసర్ డ్యాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్లు వస్తున్నాయి. విద్యార్థులతో కలసిపోయిన ఆమె తీరు బాగుంటుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.


More Telugu News