ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండ‌ర్ల నియామ‌కం భేష్: గుత్తా జ్వాల

  • రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూ గుత్తా జ్వాల ట్వీట్
  • ఇది క‌చ్చితంగా విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌గా మార‌నుందన్న బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ 
  • ట్రాన్స్‌జెండ‌ర్ల నియామ‌కంతో స‌మాజంలో వారికి అధికారిక గుర్తింపు ల‌భించింద‌ని వ్యాఖ్య
తెలంగాణ ప్ర‌భుత్వం ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియ‌మించ‌డంపై బ్యాడ్మింట‌న్ స్టార్ ప్లేయ‌ర్ గుత్తా జ్వాల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూ జ్వాల ట్వీట్ చేశారు. 

"ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణ‌యం క‌చ్చితంగా విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌గా మార‌నుంది. ట్రాన్స్‌జెండర్ల నియామకం ద్వారా... వారిని కలుపుకొనిపోవడమే కాకుండా మన సమాజంలో వారికి అధికారిక గుర్తింపును కూడా అందించింది. ఈ చ‌ర్య మ‌న తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌గ‌తిశీల మార్పున‌కు శ్రీకారం చుడుతుంది" అని గుత్తా జ్వాలా పేర్కొన్నారు. 


More Telugu News