సీఎం రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో టాలీవుడ్ ప్రముఖులు
- ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే సీఎంను కలుస్తామన్న నిర్మాత నాగవంశీ
- టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని వెల్లడి
- సంధ్య థియేటర్ ఘటన కారణంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదన్న సీఎం
టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే ముఖ్యమంత్రిని కలుస్తామని నిర్మాత నాగవంశీ తాజాగా మీడియాకు తెలిపారు.
టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కారణంగా ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దీని ప్రభావం వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలు 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం'పై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా వస్తున్న డాకూ మహారాజ్‌ను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సీఎంను కలిసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.