భారత క్రికెట్, బీసీసీఐపై ఆసీస్ ప్లేయర్లు ఏమన్నారంటే..!
- బీసీసీఐ, ఐసీసీ, ఇండియన్ క్రికెట్‌పై ఒక్క మాటలో సమాధానం ఇచ్చిన ఆసీస్ ప్లేయర్లు
- వారి వ్యాఖ్యల తాలూకు వీడియో నెట్టింట వైరల్
- బీసీసీఐ 'రూలర్స్' అని, భారత క్రికెట్ ఎంతో బలమైందన్న హెడ్
- భారత క్రికెట్ ఎంతో టాలెంటెడ్ అన్న ఉస్మాన్ ఖవాజా
గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్ అన్ని రంగాల్లోనూ ఆస్ట్రేలియా, ఇతర దేశాలను సవాలు చేస్తూ దూసుకుపోతోంది. భారత క్రికెట్ ఇంతటి ఎదుగుదలలో బీసీసీఐదే కీలక పాత్ర. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూపంలో క్రికెట్ ప్రపంచానికి టాప్ ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్‌ను అందించిన ఘనత కూడా బీసీసీఐదే. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెటర్లు భారత క్రికెట్, బీసీసీఐ గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఏబీసీ చేసిన ఇంటర్వ్యూలో బీసీసీఐ, ఐసీసీ, భారత క్రికెట్ గురించి ఒక్క పదంలో సమాధానం చెప్పాలని ఆసీస్ క్రికెటర్లను ప్రశ్నించారు. దీనిపై ఆసీస్ క్రికెటర్లు కొందరు తమదైనశైలిలో ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ప్యాట్ కమ్మిన్స్ స్పందిస్తూ.. బిగ్ అని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ బీసీసీఐని రూలర్స్ అని, భారత క్రికెట్ ఎంతో బలమైందని ప్రశంసించాడు. అలాగే ఉస్మాన్ ఖవాజా ఇండియన్ క్రికెట్ ఎంతో టాలెంటెడ్ అని, బీసీసీఐని చాలా బలమైనదిగా పేర్కొన్నాడు. నాథన్ లైయన్ బీసీసీఐని బిగ్ అని, ఐసీసీని బాస్ అని చెప్పాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బీసీసీఐ పవర్‌ఫుల్ అని తెలిపాడు. ఇక స్టీవ్ స్మిత్ ఐసీసీ కంటే బీసీసీఐ పవర్‌ఫుల్ అని చెప్పి ఆ తర్వాత జోక్ అంటూ మాట మార్చాడు. ఇలా ఇండియన్ క్రికెట్, బీసీసీఐపై ఆసీస్ ప్లేయర్లు చెప్పిన ఆసక్తికర సమాధానాల వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఇదిలాఉంటే.. భారత్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల బీజీటీ టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, అడిలైడ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుని గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రస్తుతం రెండు జట్లు మెల్‌బోర్న్‌లో ఈనెల 26న ప్రారంభమయ్యే నాలుగో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి.