ఏనుగులు ఎలుకలను చూసి... ఎందుకు భయపడతాయి?

  • ఎలుకలు వేగంగా పరుగెత్తుకు వచ్చినప్పుడు భయపడే ఏనుగులు
  • చెవులను గట్టిగా ఊపుతూ, అటూ ఇటూ కదిలే తీరు
  • దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు... అసలు కారణం ఇదేనంటూ వివరణ
భూమ్మీద నివసించే జంతువుల్లో అతి పెద్దవి ఏనుగులే. సాధారణంగా అడవికి రాజుగా చెప్పుకొనే సింహాలు కూడా వాటి జోలికి వెళ్లవు. కానీ ఎలుకలను చూస్తే మాత్రం ఏనుగులు భయపడతాయనే ప్రచారం ఒకటి ఉంది. ఇది కొంత వరకు నిజం కూడా. ఎలుకలు వేగంగా పరుగెత్తుకు వచ్చినప్పుడు ఏనుగులు కాస్త అదురుతాయి. చెవులను గట్టిగా ఊపుతూ, అటూ ఇటూ కదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్కృతులకు చెందిన పురాతన జానపద కథల్లో కూడా ఎలుకలను చూసి ఏనుగులు భయపడతాయనే భావన ఉండటం గమనార్హం.

ఇదేమిటా అని అధ్యయనం చేసి...
ఎలుకలను చూసి ఏనుగులు ఎందుకు భయపడతాయనే దానిపై ‘గ్లోబల్‌ శాంక్చువరీ ఫర్‌ ఎలిఫెంట్స్‌’ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఎలుకలే కాదు... వేగంగా పరుగెత్తుకువచ్చే కొన్ని చిన్న జీవులను చూసి కూడా ఏనుగులు భయపడతాయని తేల్చారు. లోతుగా పరిశీలించి దీనికి కారణం ఏమిటనేది తేల్చారు.

వాటి కళ్లతోనే సమస్య...
ఏనుగుల తల బాగా పెద్దగా ఉండి.. రెండు వైపులా చిన్నగా కళ్లు ఉంటాయి. దీనికితోడు ఏనుగు తల ఆకారం వల్ల దానికి నేరుగా ముందు, వెనుక ప్రాంతాలు సరిగా కనిపించవు. ‘‘ఏనుగులు రెండు పక్కలా బాగా చూడగలుగుతాయి. కానీ కింద కాళ్ల భాగంలో కూడా సరిగా చూడలేవు. అందుకే ముందు నుంచీ, వెనుక నుంచీ కాళ్ల మధ్యకు ఏదైనా చిన్న జంతువు వేగంగా దూసుకువస్తే... ఏనుగులు వెంటనే అలర్ట్‌ అవుతాయి. అవి కుక్కలు, పిల్లులు, పక్షులు అయినా కూడా సరే... ఏనుగులు అదురుతాయి..’’ అని ఈ అధ్యయనంలో భాగమైన కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జోష్‌ ప్లాట్నిక్‌ తెలిపారు.


More Telugu News