ఆసీస్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ?
- నెట్ సెషన్‌లో గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ
- మోకాలికి పట్టీ వేసిన ఫిజియోలు
- నొప్పితో కుర్చీలో కూర్చొని కనిపించిన కెప్టెన్
- తీవ్రత తక్కువే అయినప్పటికీ పరిస్థితిని పరిశీలించనున్న వైద్యులు
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26 నుంచి నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు టీమిండియాను ఆందోళనకు గురిచేసే పరిణామం జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్ సెషన్‌లో అతడి మోకాలికి దెబ్బ తగిలింది. నొప్పితోనే ప్రాక్టీస్‌ను కొనసాగించినప్పటికీ చివరికి వైద్యుల సాయం పొందాల్సి వచ్చింది.
రోహిత్ మోకాలికి ఫిజియోలు పట్టీ వేశారు. దీంతో ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ నొప్పితో కుర్చీలో కూర్చొని కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గాయం అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఫిజియోలు అతడి పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.
మరో కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఇప్పటికే గాయమైన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అతడు ఆడడం సందేహమేనంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా రోహిత్ శర్మ కూడా గాయపడడంతో నాలుగో మ్యాచ్‌కు భారత్‌కు గాయాల బెడద తప్పేలా కనిపించడం లేదు.
కాగా, భారత జట్టు ఆటగాళ్లందరూ నెట్స్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడిపారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ చేశారు.