అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఈ తెల్లవారుజామున కాల్పులు కలకలం రేపాయి. పాత సామాన్లు అమ్ముకునే వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు నాటు తుపాకితో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హనుమంతు (50), రమణ (30) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పుల ఘటనకు కారణంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.