కోడలి రహస్య భాగాల్లో ఇనుప రాడ్డుతో కాల్చి.. కారంపొడి చల్లిన భర్త, అత్తమామలు

  • మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఘటన
  • మరో వ్యక్తితో సన్నిహితంగా చూడడంతో ఆగ్రహం
  • నగ్నంగా మార్చి రెండు గంటలపాటు చిత్రహింసలు
మధ్యప్రదేశ్‌లో రాజ్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యపై భర్త, అత్తమామలు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. ఆమె రహస్య భాగాలపై వేడివేడి ఇనుపరాడ్డుతో దాడిచేయడంతోపాటు కారంపొడి వేసి పైశాకత్వం ప్రదర్శించారు. కోడలితో మరో వ్యక్తి సన్నిహితంగా ఉండడాన్ని చూసిన అత్తింటివారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్త, ఆడపడుచు, మామ కలిసి దాదాపు రెండు గంటలపాటు తనను చిత్రహింసలకు గురిచేసినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నగ్నంగా మార్చి తనను కొడుతూ, తన్నుతూ టార్చర్ చేశారని ఆరోపించింది. వేడి చేసిన ఇనుప రాడ్డుతో అత్త తన ప్రైవేటు భాగాలు, తొడలు, ఇతర భాగాలను కాల్చిందని, ఆ గాయాలపై మామ కారం పొడి చల్లాడని తెలిపింది. ఈ నెల 13న ఈ దారుణం జరిగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

ఆ తర్వాతి రోజు భర్త, మామ కలిసి తనను బైక్‌పై ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ సమీపంలో దాచిపెట్టారని బాధితురాలు తెలిపింది. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పుట్టింటికి చేరుకుని విషయం చెప్పింది. అనంతరం వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ రోజు రోహిత్ రుహేలా అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి స్టీమ్ మిషన్ అడిగాడని, గేటు వద్దే ఉండమని చెప్పి తాను ఇంట్లోకి వెళ్లేసరికి అతడు గేట్ క్లోజ్ చేసి ఇంట్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని, అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆడపడుచు అది చూసి కుటుంబ సభ్యులను పిలిచిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత అందరూ కలిసి తనను నగ్నంగా మార్చి చిత్రహింసలు పెట్టారని వాపోయింది. 


More Telugu News