సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

  • మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ వ్యాన్
  • గాయపడిన వారిని బెంగళూరు ఆసుపత్రికి తరలింపు
  • మినీ వ్యాన్‌లో తిరుమల వెళ్లి వస్తుండగా ఘటన
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో శనివారం వేకువజామున జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.

క్షతగాత్రులను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. మృతులను గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో మినీ వ్యాన్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News