రూ.1.26 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
- అద్దంకి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
- కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న మంత్రి గొట్టిపాటి
- నిరుపేద రోగులకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకిలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి .. ఒకేసారి 111 మంది లబ్దిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం 1 కోటి 26 లక్షల 71 వేల 93 రూపాయల విలువైన చెక్కులతో పాటు ఆరుగురికి ఆపరేషన్ల నిమిత్తం 29 లక్షల 80 వేల విలువైన ఎల్ఓసీలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే .. మరో పక్క హార్ట్, కేన్సర్, కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తోందని తెలిపారు.
అంతే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ఆపరేషన్ల నిమిత్తం సమయానికి ఎల్ఓసీలు అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వమని పేర్కొన్నారు.