పుష్ప-2 దెబ్బకు ఈ రికార్డు కూడా మటాష్!
- బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న పుష్ప -2: ది రూల్
- హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే రూ.632.50కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు
- ఇప్పటి వరకు ఎక్కువ మొత్తం వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న స్త్రీ 2 చిత్రం లైఫ్ టైమ్ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే అధిగమించిన పుష్ప – 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప -2: ది రూల్ బ్లాక్‌బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా ఊచకోత కోస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ప్రధానంగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో పుష్ప 2 చిత్రంతో ఐకాన్ స్టార్ కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే రూ.632.50కోట్ల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప - 2 ది రూల్ ఆ ఘనతను సాధించింది.
ఇప్పటి వరకూ ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న స్త్రీ 2 చిత్రం లైఫ్ టైమ్ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప - 2 అధిగమించడం విశేషం. అంతే కాకుండా అత్యంత వేగంగా 14 రోజుల్లోనే రూ.1500 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, కేవలం ముంబయిలో రూ.200 కోట్లు నెట్ వసూలు చేసిన తొలి చిత్రంగా పుష్ప - 2 రికార్డు క్రియేట్ చేసింది.