ఎన్ హెచ్ఆర్సీ చైర్మన్ గా జస్టిస్ డీవై చంద్రచూడ్ అంటూ వార్తలు... అందులో నిజమెంత?
- ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్
- ఆయన పేరును ఎన్ హెచ్ఆర్సీ చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నారంటూ వార్తలు
- అందులో నిజం లేదన్న చంద్రచూడ్
- ప్రస్తుతానికి మరో పదవి చేపట్టే ఆలోచన లేదని స్పష్టీకరణ
- విశ్రాంత జీవనాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నానని వెల్లడి
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు కేంద్రం కీలక పదవి అప్పగిస్తోందని, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఆయన పేరు పరిశీలనలో ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా స్పందించారు.
ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మరో పదవి స్వీకరించే ఆలోచన లేదని, విశ్రాంత జీవితాన్ని కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదిస్తున్నానని వెల్లడించారు. తనను ఎన్ హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తున్నారంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఎన్ హెచ్ఆర్సీ చైర్మన్ గా ఈ ఏడాది వేసవిలో పదవీ విరమణ చేశారు. దాంతో జూన్ 1 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో, ఆ కీలక పదవికి జస్టిస్ చంద్రచూడ్ పేరును కేంద్రం పరిశీలిస్తోందంటూ వార్తలు వచ్చాయి.