ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం... కేసు నమోదుకు సిద్ధమవుతున్న ఈడీ!

  • రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
  • ఏసీబీ నమోదు చేసిన కేసు ఎఫ్‌ఐఆర్, డాక్యుమెంట్లను కోరిన జాతీయ దర్యాప్తు సంస్థ
  • వివరాలన్ని పరిశీలించాక కేసు నమోదు చేసే అవకాశం
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫార్మాలా ఈ-రేస్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విదేశీ సంస్థకు నిధుల మళ్లీంపునకు సంబంధించిన ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, డాక్యుమెంట్ల కాపీలను అందివ్వాలని ఈడీ కోరింది. ఈ మేరకు ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. వివరాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన అనంతరం ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ (డాలర్లు) రూపంలో నిధులు చెల్లించాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు కేటీఆర్‌పై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ వ్యవహారంపై ఏసీబీ గురువారం నాడు కేసు నమోదు చేసింది. కేటీఆర్‌ను ఏ1గా, నిధుల మళ్లింపు సమయంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్‌‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌‌గా ఉన్న బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా ఏసీబీ అధికారులు చేర్చారు.

కాగా తనపై ఏసీబీ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఇవాళ (శుక్రవారం) తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు.


More Telugu News