అమెరికా 'షట్ డౌన్' తప్పేలా లేదంటున్న నిపుణులు
- ప్రతినిధుల సభలో కీలక బిల్లుకు తిరస్కరణ
- డెమోక్రాట్లకు 38 మంది రిపబ్లికన్ సభ్యుల మద్దతు
- ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన బిల్లుపై వ్యతిరేకత
- శుక్రవారం రాత్రిలోగా ఆమోదం లభించకుంటే షట్ డౌన్ తప్పని పరిస్థితి
అగ్రరాజ్యం అమెరికా షట్ డౌన్ ముప్పు ఎదుర్కొంటోంది. కీలకమైన బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాత్రిలోగా బిల్లుకు ఆమోదం లభించకుంటే షట్ డౌన్ తప్పదని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం చెప్పారు. పలు డిమాండ్లతో సవరణలు ప్రతిపాదించారు. రెండేళ్ల పాటు రుణాలపై సీలింగ్ ను సస్పెండ్ చేయడం సహా ట్రంప్ చేసిన పలు డిమాండ్లను చేర్చి మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ కొత్త బిల్లును ప్రవేశ పెట్టారు. దీంతో బిల్లుకు మద్దతు తెలుపుతూ ట్రంప్ ఓటేశారు. మద్దతుగా ఓటేయాలంటూ రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు.
అయితే, ఈ కొత్త బిల్లును డెమోక్రాట్లు తిరస్కరించారు. ప్రతినిధుల సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా.. 235- 174 తేడాతో సభ తిరస్కరించింది. డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. సెనేట్ లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండడంతో కీలకమైన ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. షట్‌డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, ట్రంప్ హయాంలో దాదాపు 35 రోజుల పాటు కొనసాగిందని వివరించారు. అమెరికా చరిత్రలోనే ఇది సుదీర్ఘమైన షట్‌డౌన్ అని వివరించారు.
షట్ డౌన్ వల్ల ఎదురయ్యే సమస్యలు..
షట్ డౌన్ వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 8,75,000 మంది పనులు స్తంభించిపోతాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని మరో 14 లక్షల మంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సిందే. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగుల సేవలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించబోదని, షట్ డౌన్ ముగిసాకే జీతాలు చెల్లిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ చెల్లింపులపై ఎలాంటి హామీ ఉండకపోవడంతో ఉద్యోగులకు ఆందోళన తప్పదని చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై షట్ డౌన్ ప్రభావం ఉండదని, అయితే, సోషల్ సెక్యూరిటీ ఆఫీస్‌ల ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయని అన్నారు. నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయని నిపుణులు చెబుతున్నారు.