పార్లమెంట్‌లో మళ్లీ అదే రచ్చ.. లోక్‌సభ నిరవధిక వాయిదా

పార్లమెంట్‌లో మళ్లీ అదే రచ్చ.. లోక్‌సభ నిరవధిక వాయిదా
 
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు చివరి రోజైన శుక్రవారం కూడా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకున్నారు. సభా నాయకులు, విపక్ష నేతలు తన ఛాంబర్‌‌కు వచ్చి కలవాలని ఆయన కోరారు.

మరోవైపు, లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విపక్ష ఎంపీల నినాదాలపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. పార్లమెంటు గౌరవాన్ని, సభలో శాంతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపైనా ఉందని పునరుద్ఘాటించారు. జాతీయగీతాలాపన పూర్తయిన వెంటనే సభను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. శీతాకాల సమావేశాలకు ముగింపు సూచకంగా వాయిదా వేశారు. దీంతో దిగువ సభ నిరవధిక వాయిదా పడింది. కాగా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.


More Telugu News