ఎస్ బీఐ భారీ నోటిఫికేషన్.. ఏకంగా 13 వేల క్లర్కు పోస్టుల భర్తీ

  • జనరల్ కేటగిరీలో 5 వేల ఖాళీలు
  • డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు
  • ప్రారంభంలోనే రూ.47 వేల వరకు జీతం అందుకునే ఛాన్స్
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) భారీ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. వివిధ బ్రాంచిలలోని 13 వేల జూనియర్ అసోసియేట్, క్లర్కు ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తం 13 వేల పోస్టులలో 5 వేలకు పైగా జనరల్ కేటగిరీలోనే ఉండడం విశేషం. ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలోనే రూ.47 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలు...

పోస్టులు: జూనియర్ అసోసియేట్, క్లర్క్

ఖాళీలు: 13,735 (5,870 జనరల్, 3,001 ఓబీసీ, 2,118 ఎస్సీ, 1,385 ఎస్టీ, 1,361 ఈడబ్ల్యూఎస్)
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఏదేని విభాగంలో డిగ్రీ (ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు), స్థానిక భాషలో మంచి పట్టు ఉండాలి. మాట్లాడటం, చదవడం, రాయడం స్పష్టంగా రావాలి.

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్య (1996 ఏప్రిల్ 2 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించిన వారు) రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ: ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

నియామక ప్రక్రియ: తొలి దశలో ఆన్ లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష.. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్, అనంతరం లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: జూనియర్ అసోసియేట్ స్థాయి నుంచి క్లర్కు పొజిషన్ ను బట్టి ప్రారంభ వేతనం రూ.17,900 నుంచి రూ.47,920.


More Telugu News