నేడు సాలూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన

  • ప్రత్యేక విమానంలో విశాఖకు.. రోడ్డు మార్గాన సాలూరుకు  
  • రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్ కల్యాణ్
  • నేడు గిరిజనులతో పవన్ ముఖాముఖి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. సాలురు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. 

పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 11.30 గంటల ప్రాంతానికి సాలూరు డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు. తదుపరి సాలూరు నుంచి బయలుదేరి మక్కువ మండలం బాగుజోలకు 12.30 గంటలకు చేరుకుంటారు. 

అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి తదుపరి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గిరిజనులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకుంటారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రానికి పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు.  


More Telugu News