బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఏపీఎస్డీఎంఏ అప్ డేట్

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
  • రాగల 12 గంటల్లో వాయవ్య దిశగా పయనం
  • ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం
  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఏపీఎస్డీఎంఏ
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. రాగల 12 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు పయనిస్తుందని... తదుపరి 24 గంటల్లో ఉత్తర దిశగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళుతుందని వివరించింది. 

దీని ప్రభావంతో రేపు (డిసెంబరు 20) విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. 

అదే సమయంలో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కోనసీమ, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.


More Telugu News