టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యేలంద‌రూ సిద్ధంగా ఉన్నారు: మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి

  • వైసీపీలో కొన‌సాగితే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ త‌ప్ప‌ద‌ని ఎమ్మెల్యేలు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని వ్యాఖ్య‌
  • త్వ‌ర‌లోనే వైసీపీ ఖాళీ కావ‌డం ఖాయ‌మ‌న్న మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి
  • ఇప్ప‌టికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబుతో ట‌చ్‌లో ఉన్నార‌ని వెల్ల‌డి
ఏపీ ర‌వాణాశాఖ మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి తాజాగా ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ త‌లుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలంద‌రూ పార్టీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు. త్వ‌ర‌లోనే వైసీపీ ఖాళీ కావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఆ పార్టీలో కొన‌సాగితే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొవ‌డం త‌ప్ప‌ద‌ని ఎమ్మెల్యేలు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని మంత్రి పేర్కొన్నారు.  

ఇప్ప‌టికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలిపారు. ఇంకా ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప‌లువురు వైసీపీ కీల‌క నేత‌లు టీడీపీలో చేరనున్నార‌ని మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్య‌మ‌ని అన్నారు. 

అలాగే జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఎన్‌డీఏ కూట‌మి భ‌య‌ప‌డ‌టం లేద‌న్నారు. ఒక‌వేళ ఎన్నిక‌లు త్వ‌ర‌గా వ‌చ్చినా వైసీపీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థులే ఉండ‌ర‌ని చుర‌క‌లంటించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ బీఫాంలు ఇస్తామ‌ని బ‌తిమాలినా కూడా ఎవ‌రూ తీసుకోవ‌డానికి ముందుకు రార‌ని మంత్రి మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.


More Telugu News