అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తెచ్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది: షర్మిల

  • అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ ఏపీ పీసీసీ చీఫ్
  • అంబేద్కర్ ను అవమానించడం బీజేపీ అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యలు
  • దళిత, గిరిజన వర్గాల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫైర్
దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు దైవంగా పూజించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను బీజేపీ అవమానించిందంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆ పార్టీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. అంబేద్కర్ పై వ్యాఖ్యలతో దళితులు, గిరిజనుల మనోభావాలను అమిత్ షా దెబ్బతీశారని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ తో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతోందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

మనుస్మృతిని విశ్వసిస్తుంది కాబట్టే బీజేపీ అనుక్షణం రాజ్యాంగంపై దాడికి పాల్పడుతోందని అన్నారు. బహిరంగ సభా వేదికలతో పాటు సాక్షాత్తూ పార్లమెంట్ లోనే అంబేద్కర్ ను అవమానిస్తున్నారని, హేళన చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా, ఏఐసీసీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ షర్మిల తెలిపారు.


More Telugu News