విన‌సొంపుగా 'సంక్రాంతికి వ‌స్తున్నాం' రెండో పాట

  • వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’
  • జ‌న‌వ‌రి 14న‌ విడుదల కానున్న సినిమా
  • తాజాగా రెండో పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్
విక్టరీ వెంకటేశ్‌, యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఫ్యామిలీ, క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 14న‌ విడుదల కానుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన సినిమాలో ఫ‌స్ట్ సాంగ్ గోదారి గట్టు మీద రామ సిల‌క‌వే శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకోగా.. తాజాగా రెండో పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

మీనూ.. అంటూ సాగే ఈ పాట విన‌సొంపుగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాట విన‌గానే ఆకట్టుకునేలా ఉంది. అలాగే పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీరామ్ చ‌క్క‌టి లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో వెంకటేశ్ స‌ర‌స‌న‌ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజ్, శిరీష్ నిర్మిస్తున్నారు.



More Telugu News