అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం.. కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ

   
అమెరికాలోని కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) కలకలం రేపుతోంది. 34 మంది ఈ వైరస్ బారిన పడడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తూ గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. 

వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమించిన ఆధారాలు లభించలేదని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడిన వారందరూ ఆ డెయిరీ ఫాంలో పనిచేసినవారు, అక్కడికి దగ్గర్లో ఉన్నవారేనని వివరించారు. ఈ వైరస్ వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.


More Telugu News