మొగులన్నా.. నీ పాట మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది: కేటీఆర్
- బలగం మొగిలయ్య మృతిపట్ల కేటీఆర్ సంతాపం
- ఆయన మరణించినా పాట రూపంలో బతికే ఉంటారన్న కేటీఆర్
- మొగిలయ్య పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని కితాబు
ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు బలగం మొగిలయ్య మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. మొగిలయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారని అన్నారు. ఆయన పాటకు చలించని హృదయం లేదన్నారు. పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని కితాబునిచ్చారు.
మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తుచేశారన్నారు. ఆయన పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని, మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిందని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.