లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్

  • మరో 24 మంది నిందితులకు కూడా బెయిల్
  • సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు
  • ఏ-2 నిందితుడు సురేశ్‌కు బెయిల్ నిరాకరణ
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. అతనితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న 24 మందికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది.

పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మిగతా రైతులు రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. ఈ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న సురేశ్‌కు మాత్రం నాంపల్లి కోర్టు బెయిల్‌ను నిరాకరించింది.


More Telugu News