సచిన్​ టెండూల్కర్​ కు తబలా నేర్పిన జాకీర్​ హుస్సేన్​... వైరల్​ వీడియో!

  • సచిన్, జాకీర్ హుస్సేన్ ఇద్దరూ తమ రంగాల్లో అనితర సాధ్యులే...
  • ఒక సందర్భంలో సచిన్ కు తబలా ఎలా వాయించాలో చూపిన జాకీర్
  • సోషల్ మీడియాలో వైరల్ గారిన పాత వీడియో
తబలా మాంత్రికుడు జాకీర్ హుస్సేన్... క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్... ఇద్దరూ అనితర సాధ్యులే. తమ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపి, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఉద్ధండులే. అలాంటి వారిద్దరూ ఒకచోట చేరడం, అందులోనూ సచిన్ టెండూల్కర్ కు జాకీర్ హుస్సేన్ తబలా ఎలా వాయించాలో నేర్పించడం మరింత స్పెషల్ కదా! దీనికి సంబంధించిన ఓ పాత వీడియో... ఇటీవల జాకీర్ హుస్సేన్ కన్నుమూసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు మాస్టర్లు ఒకే వేదికపై ఇలా కనిపించడం అద్భుతమంటూ కామెంట్లు వస్తున్నాయి. జాకీర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం వ్యక్తమవుతోంది.


More Telugu News