ఓటీటీ సెంటర్లో పల్లెటూరి ప్రేమకథ!
- షణ్ముఖ్ జస్వంత్ హీరోగా 'లీలా వినోదం'
- ఆయన జోడీకట్టిన అనఘ
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- ఈ నెల 19 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
ప్రేమకథలు చాలావరకూ అందంగానే సాగుతాయి .. ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అందునా విలేజ్ నేపథ్యంలోని లవ్ స్టోరీస్ మరింత ప్రత్యేకతను సంతరించుకుని, ఆహ్లాదాన్ని పంచుతాయి. సహజత్వం .. ఫీల్ ప్రేమకథలకు ప్రాణవాయువు లాంటివి. అలాంటి ఫీల్ తో కూడిన ఓ ప్రేమకథ ఇప్పుడు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే ' లీలా వినోదం'.
యూ ట్యూబర్ గా మంచి క్రేజ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఈ సినిమాలో కథానాయకుడు. ఆయన జోడీగా అనఘ కనిపించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లోని ఈ సినిమాకి శ్రీధర్ మారిసా నిర్మాతగా వ్యవహరించగా, పవన్ సుంకర దర్శకత్వం వహించాడు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే .. అది ఒక పల్లెటూరు. ఆ ఊరికే అందాన్ని తెచ్చిన అమ్మాయిగా అందరూ 'లీల' పేరు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి 'లీల'ను ప్రసాద్ ప్రేమిస్తాడు. అయితే తన మనసులోని ప్రేమను చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోదు. ఫ్రెండ్స్ ధైర్యం చెప్పడంతో తన ప్రేమ గురించిన మెసేజ్ పెడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. ఆమని .. గోపరాజు రమణ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.