73ఏళ్ల భార్యకు 70ఏళ్ల భర్త విడాకులు.. వ్యవసాయ భూమి అమ్మి రూ.3.7 కోట్ల భరణం ఇచ్చిన రైతు!
- హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఘటన
- రూ.3.7 కోట్ల భరణంతో 44 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన రైతు
- 70 ఏళ్ల రైతు సుభాశ్ చంద్, 73 ఏళ్ల సంతోష్ కుమారికి 1980లో వివాహం
- ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా 2006 నుంచి విడివిడిగా జీవనం
- 2013లో ఫ్యామిలీ కోర్టులో సుభాశ్ చంద్ విడాకుల కోసం పిటిషన్
- ఆ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం
- దాంతో పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించిన రైతు
- 11 ఏళ్ల తర్వాత ఇరువర్గాల మధ్య మధ్యవర్తిత్వంతో తాజాగా విడాకులు
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో 70ఏళ్ల వృద్ధ దంపతులు విడాకులు తీసుకున్న ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఉన్నదంతా అమ్మి మరీ రూ.3.7 కోట్ల భరణంతో 44 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడా రైతు. ఈ దంపతులు గత 18ఏళ్లుగా విడివిడిగా జీవిస్తుండగా.. తాజాగా విడాకులతో వీరి పెళ్లి బంధానికి ఎండ్‌కార్డ్ పడింది.
వివరాల్లోకి వెళితే.. కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు సుభాశ్ చంద్, 73 ఏళ్ల సంతోష్ కుమారికి 1980 ఆగస్టు 27న వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. అయితే కాలం గడిచేకొద్దీ దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో 2006 నుంచి ఇద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో భార్య సంతోష్ కుమారి తనను మానసికంగా హింసిస్తోందని భర్త సుభాశ్ చంద్ 2013లో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
అనంతరం ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కేసు 11 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ క్రమంలో 2024 నవంబర్ 4న ఇరువర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిగింది. దాని ప్రకారం భార్య, ముగ్గురు పిల్లలకు రూ.3.7 కోట్లు శాశ్వత భరణం చెల్లించి తన వివాహాన్ని రద్దు చేసుకోవడానికి భర్త అంగీకరించాడు.
దీన్ని శాశ్వత భరణంగా పరిగణిస్తామని ఒప్పందంలో స్పష్టం చేశారు. భార్య కూడా అందుకు ఒప్పుకుంది. ఆ ఒప్పందం ప్రకారం భార్య, పిల్లలు సుభాశ్ చంద్ ఆస్తిపై అన్ని హక్కులను వదులుకున్నారు. ఇక పరస్పర నిర్ణయాన్ని అంగీకరించిన హైకోర్టు గత వారం విడాకులు మంజూరు చేసింది.
ఇక సుభాశ్ చంద్ ఒప్పందం ప్రకారం భరణం చెల్లించడానికి తన వ్యవసాయ భూమిని రూ.2.16కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ ను భార్యకు ఇచ్చాడు. అలాగే పంట విక్రయాల ద్వారా వచ్చిన రూ.50 లక్షల నగదు, రూ.40 లక్షల బంగారు, వెండి ఆభరణాలు అతని సెటిల్మెంట్లో ఉన్నాయని సుభాశ్ చంద్ తరఫు న్యాయవాది రాజిందర్ గోయెల్ వివరించారు.
న్యాయమూర్తులు సుధీర్ సింగ్, జస్జిత్ సింగ్ బేడీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ ఒప్పందాన్ని చెల్లుబాటు చేసి వివాహాన్ని అధికారికంగా రద్దు చేసింది.