అశ్విన్ నిర్ణయం నాకు అప్పుడే తెలిసింది: రోహిత్ శర్మ

  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్
  • పెర్త్ కు వచ్చినప్పుడే అశ్విన్ నిర్ణయం తెలిసిందన్న రోహిత్
  • అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య
అంతర్జాతీయ క్రికెట్ కు దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు రోహిత్ తో పాటు అశ్విన్ కూడా వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి వెళ్లిపోయాడు. 

అనంతరం రోహిత్ మాట్లాడుతూ... తాను పెర్త్ కు వచ్చినప్పుడే అశ్విన్ నిర్ణయం తెలిసిందని... ఆ టెస్ట్ జరుగుతున్నప్పుడు తాను లేనని రోహిత్ తెలిపాడు. అశ్విన్ రిటైర్మెంట్ కు అనేక కారణాలు ఉండొచ్చని... ఆయన తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అశ్విన్ కు తెలుసని... తాము ఎలాంటి కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నామో ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. 

పిచ్ పరిస్థితిని బట్టి ఏ స్పిన్నర్ ను ఆడించాలో మేనేజ్ మెంట్ చూసుకుంటుందని... తాను పెర్త్ కు వచ్చినప్పుడు ఇదే విషయం చర్చకు వచ్చిందని రోహిత్ తెలిపాడు. పింక్ బాల్ టెస్టులో ఆడాలని అశ్విన్ ను ఒప్పించానని... ఈ మ్యాచ్ లో జడేజాను బరిలోకి దింపామని చెప్పాడు. తనకు అవకాశం రానప్పుడు ఆటకు వీడ్కోలు పలకడమే మేలని అశ్విన్ అనుకుని ఉండొచ్చని తెలిపాడు. 

అశ్విన్ తనకు అండర్-17 స్థాయి నుంచి తెలుసని... అంతర్జాతీయ క్రికెట్ లో కూడా కలిసి ఆడామని రోహిత్ చెప్పాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని తెలిపాడు భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన అశ్విన్ ఇప్పుడు వీడ్కోలు పలికాడని వ్యాఖ్యానించాడు.


More Telugu News