ఓఆర్ఆర్ పై మనీ హంట్.. 20 వేల నోట్ల కట్ట విసిరేసిన యువకుడిపై కేసు.. వీడియో ఇదిగో!

--
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. చాలామంది నడి రోడ్డుపై డ్యాన్సులు, ప్రమాదకరమైన ఫీట్లతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా బాలానగర్ కు చెందిన యూట్యూబర్ భానుచందర్ మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో ఓ రీల్ చేశాడు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పక్కన రూ.20 వేల నోట్ల కట్ట పడేసి వెతికి తీసుకెళ్లండంటూ తన ఫాలోవర్లకు చెప్పాడు.

ఈ వీడియో కాస్తా వైరల్ గా మారడంతో పోలీసులు స్పందించారు. ఈ వీడియో వల్ల పెద్ద సంఖ్యలో జనం ఓఆర్ఆర్ పైకి వస్తారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. దీంతో భానుచందర్ పై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 లతో పాటు జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 8 (బి) కింద కేసులు నమోదు చేశామని ఘట్కేసర్ పోలీసులు వివరించారు.


More Telugu News