అల్లు అర్జున్ అభిమానుల‌కు ఊహించ‌ని షాకిచ్చిన‌ పోలీసులు!

  • బ‌న్నీ అరెస్టు త‌ర్వాత అభిమానుల అత్యుత్సాహం
  • తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డిపై నెట్టింట‌ అభ్యంత‌ర‌క‌ర పోస్టులు 
  • అలాంటి అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై నిఘా పెట్టిన పోలీసులు
  • కాంగ్రెస్ నేత‌లు స‌హా ప‌లువురి ఫిర్యాదు మేర‌కు తాజాగా బ‌న్నీ ఫ్యాన్స్‌పై కేసులు న‌మోదు
ఈ నెల 4న 'పుష్ప‌-2: ది రూల్' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న నేప‌థ్యంలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, త‌మ అభిమాన హీరోను అరెస్టు చేయ‌డం ప‌ట్ల బ‌న్నీ ఫ్యాన్స్ తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

అలాంటి అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై నిఘా పెట్టిన పోలీసులు.. కాంగ్రెస్ నేత‌లు స‌హా ప‌లువురి ఫిర్యాదు మేర‌కు తాజాగా అల్లు అర్జున్ అభిమానుల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా ఈ వ్యవహరంలో కీల‌కంగా ఉన్న ప‌లువురు బ‌న్నీ ఫ్యాన్స్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆగ‌మేఘాల మీద తాము చేసిన సోష‌ల్ మీడియా పోస్టుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.  




More Telugu News