నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని.. రేవంత్ ని చూసే రాసుంటారు: కేటీఆర్‌

  • సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు
  • ముఖ్య‌మంత్రి పాద‌యాత్ర విష‌య‌మై సెటైర్లు 
  • ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ఆస‌క్తిక‌ర పోస్ట్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈసారి ముఖ్య‌మంత్రి పాద‌యాత్ర విష‌య‌మై సెటైర్లు వేశారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్టర్‌) వేదిక‌గా కేటీఆర్ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. 

"వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్.. ఇవాళ అదానీకి వ్యతిరేక ర్యాలీ తీయాలనుకుంటున్నాడు. జైపూర్ లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదనో.. ఢిల్లీలో అపాయింట్‌మెంట్‌ దక్కలేదనో.. మొత్తానికి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు మన చిట్టినాయుడు. 

భాయ్, భాయ్ అని వందల, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి.. అదానీ వ్యతిరేక ర్యాలీ తీస్తున్నాడంట. 
నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని…రేవంత్ ని చూసే రాసుంటారూ. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రం ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా?  లేక మళ్లీ మళ్లీ మోసం చెయ్యచ్చులే అనుకుంటున్నావా? దొంగే దొంగ అనడం నేడు కామన్ అయిపోయింది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 


More Telugu News