రామ్ చరణ్ అయ్యప్ప మాల విసర్జన ఎక్కడ చేస్తున్నారంటే..!

  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'గేమ్ ఛేంజర్'
  • ఈ నెల 21న డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • డల్లాస్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలను విసర్జించనున్న చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు అయ్యప్ప స్వామిపై ఎంతో భక్తిభావం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఆయన అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ ఏడాది కూడా చరణ్ అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. మరోవైపు, చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

అమెరికాలోని డల్లాస్ లో 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21న జరగనుంది. ఈ ఈవెంట్ కోసం చరణ్, శంకర్, ఎస్.జె.సూర్య, నిర్మాత దిల్ రాజు తదితరులు యూఎస్ కు వెళుతున్నారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న చరణ్... మాల విసర్జన సమయానికి అమెరికాలో ఉంటారు. దీంతో, డల్లాస్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో చరణ్ మాల విసర్జన చేయనున్నట్టు తెలుస్తోంది. దీక్ష విరమణ అనంతరం రెగ్యులర్ అవుట్ ఫిట్ లో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్నట్టు సమాచారం.


More Telugu News