మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ

మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ
  • బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య బిల్లులకు ఆమోదం
  • ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించిన శాసనసభ
  • లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్, బీజేపీ పట్టు
తెలంగాణ శాసనసభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య ఈ బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించారు.

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. లగచర్ల రైతుకు సంకెళ్లు వేయడంపై చర్చ జరపాలని డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే శాసనసభ మూడు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.


More Telugu News