ఆ నిర్మాణాలను కూల్చబోం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

  • హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమన్న రంగనాథ్
  • హైడ్రా ఏర్పడిన తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వెల్లడి
  • హైడ్రా పేదల జోలికి వెళ్లదన్న రంగనాథ్
హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని, కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్ (హైడ్రా) రంగనాథ్ తెలిపారు. అంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.

మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... గతంలో అనుమతి తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు తాము వెళ్లబోమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు మాత్రం తప్పదన్నారు. కొత్తగా అనుమతులు తీసుకుంటే హైడ్రా పరిశీలిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పని చేస్తోందన్నారు. హైడ్రా పేదల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు. పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోందనేది తప్పుడు ప్రచారమని, అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. 


More Telugu News