లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్

  • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై అందుబాటులో భారీ డిస్కౌంట్లు
  • రూ.10 వేల వరకు తగ్గింపు
  • బ్యాంక్ కార్డులు, ఎక్స్చేంజ్ రూపంలో మరింత డిస్కౌంట్ లభ్యం
ఐఫోన్-15 మోడల్ ఫోన్లు కొనాలని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లకు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్16 ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో పాత మోడల్ ఫోన్ల రేట్లు తగ్గుతున్నాయి.

ఈ క్రమంలో ఐఫోన్ 15 ధర రూ.10,000 మేర తగ్గింది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్‌ ఫోన్లు గణనీయ డిస్కౌంట్ ఆఫర్లపై లభిస్తున్నాయి. 256జీబీ వేరియెంట్ ఫోన్ అసలు ధర రూ.70,999గా ఉండగా ప్రస్తుతం సుమారు రూ.9,000 భారీ తగ్గింపుపై అందుబాటులో ఉంది. రూ.1000 అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ప్రయోజనాన్ని కూడా వినియోగదారులు పొందవచ్చు. ఇక అమెజాన్‌పై 256జీబీ వేరియెంట్ ఐఫోన్15 మోడల్ రూ.4,000 ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డులను ఉపయోగించి అదనంగా మరో రూ.4000 డిస్కౌంట్‌ పొందేందుకు అవకాశం ఉంది. అమెజాన్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.


More Telugu News