రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వాగతం
--
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో వీరు పూల బొకేలు ఇచ్చి స్వాగతించారు. ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరారు. ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.