లగచర్ల రైతులకు సంఘీభావంగా.. చేతుల‌కు బేడీల‌తో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

    
లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. "ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూటీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు" అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంట‌నే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఈ వినూత్న నిర‌స‌న తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  


More Telugu News