సరికొత్త చరిత్ర సృష్టించిన పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం!

  • వెంకటాపురంలో 100 శాతం టీడీపీ సభ్యత్వం
  • గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 581
  • సంతోషం వ్యక్తం చేసిన పరిటాల సునీత
దివంగత టీడీపీ నేత పరిటాల రవి స్వగ్రామమైన వెంకటాపురం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గ్రామంలోని ఓటర్లందరూ టీడీపీ సభ్యత్వం తీసుకుని చరిత్ర సృష్టించారు. గ్రామంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా... వీరిలో 11 మంది చనిపోయారు. మిగిలిన 570 మందిలో ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రికార్డు సాధించిన ఏకైక గ్రామంగా వెంకటాపురం నిలిచిందని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. 100 శాతం సభ్యత్వం నమోదు కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.


More Telugu News