బ‌తికున్న కోడిపిల్ల‌ను అమాంతం మింగేసిన వ్యక్తి.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!

  • పిల్ల‌లులేని ఓ వ్య‌క్తి మూఢ‌న‌మ్మ‌కంతో బ‌తికున్న కోడిపిల్ల‌ను మింగేసిన వైనం
  • అది గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరాడ‌క మృతి
  • ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని అంబికాపూర్ లో ఘ‌ట‌న‌
  • తాంత్రికుడి మాట‌లు న‌మ్మి ప్రాణాలు తీసుకున్న ఆనంద్ యాద‌వ్ అనే వ్య‌క్తి
పిల్ల‌లులేని ఓ వ్య‌క్తి మూఢ‌న‌మ్మ‌కంతో బ‌తికున్న కోడిపిల్ల‌ను అమాంతం మింగేశాడు. అది కాస్తా గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరాడ‌క మృతిచెందాడు. అయితే, అత‌డు చ‌నిపోయినా ఆ కోడిపిల్ల బ‌తికే ఉండ‌టం గ‌మ‌నార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని అంబికాపూర్‌కి చెందిన ఆనంద్ యాద‌వ్‌కు పెళ్లై చాలా ఏళ్లు అయినా పిల్ల‌లు పుట్టలేదు. దాంతో పిల్ల‌లు పుట్టే మార్గం చూప‌మ‌ని ఓ తాంత్రికుడిని సంప్ర‌దించాడు. 

అత‌డి సూచ‌న మేర‌కు బ‌తికున్న కోడిపిల్ల‌ను అమాంతం మింగేశాడు. అది అత‌డి గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరాడ‌క కుప్ప‌కూలాడు. దాంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆనంద్‌ను అంబికాపూర్‌లోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే అత‌డు చ‌నిపోయిన‌ట్లు అక్క‌డి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో అత‌డి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు. 

అయితే, ఆనంద్ చ‌నిపోయినా ఆ కోడిపిల్ల‌ బ‌తికే ఉండ‌టం వైద్యుల‌కు షాకిచ్చింది. 20 సెంటీమీట‌ర్ల కోడిపిల్ల గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరాడ‌క ఆనంద్ యాద‌వ్ చ‌నిపోయిన‌ట్లు వైద్యుడు సంతు బాగ్ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.    


More Telugu News