గ్రూప్-2 పరీక్షలు రాస్తుండగా గుండెపోటు... అభ్యర్థిని మూడో అంతస్తు నుంచి మోసుకుంటూ వచ్చిన ఎస్సై

  • పటాన్‌చెరు డిగ్రీ కాలేజీలో ఘటన
  • పరీక్ష రాస్తుండగా అస్వస్థత... పోలీసులకు సమాచారమిచ్చిన నిర్వాహకులు
  • వాహనంలో తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించిన ఎస్సై
గ్రూప్-2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్సై అతనిని ఆసుపత్రిలో చేర్పించాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామం లక్ష్మీనగర్‌కు చెందిన నగేశ్ గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యాడు.

నాలుగో పేపర్ రాస్తుండగా అతడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూసే పరిస్థితి లేదు. దీంతో అక్కడే ఉన్న ఎస్సై ఆసిఫ్ మూడో అంతస్తులో ఉన్న నగేశ్‌ను భుజంపై మోసుకుంటూ కిందకు తీసుకువచ్చారు. వాహనంలో ఎక్కించి పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, అతడికి మూర్ఛ వ్యాధి ఉందని, గుండెపోటు కాకపోవచ్చని వైద్యులు అన్నారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.


More Telugu News