దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన
- కొనసాగుతున్న అల్పపీడనాల సీజన్
- బంగాళాఖాతంలో ఇటీవల వరుసగా అల్పపీడనాలు
- తాజా అల్పపీడనం మరింత బలపడుతుందన్న ఐఎండీ
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వస్తుందని ఐఎండీ వివరించింది.
దీని ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
కోస్తాంధ్ర, రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో 17 నుంచి 20వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.