కొంచెం పక్కకు తప్పుకో బాబూ... ఏనుగు వీడియో వైరల్!
- ఓ ఇంటి ముందు నిలబడిన వ్యక్తి వద్దకు వచ్చిన ఏనుగు
- దారి నుంచి పక్కకు తప్పుకోవాలని సిగ్నల్
- భయంతో పరుగెత్తిన వ్యక్తి... సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఓ వ్యక్తి ఒక ఇంటి ముందు దారిలో నిలబడ్డాడు. అంతలోనే ఓ పెద్ద ఏనుగు వెనుకవైపు నుంచి వచ్చింది. అది గమనించని వ్యక్తి అలాగే దారిలో నిలబడి ఉన్నాడు. దగ్గరి దాకా వచ్చిన ఏనుగు... అతడిని ఏమీ చేయలేదు. అలాగని ఎలాంటి ధ్వని కూడా చేసి భయపెట్టలేదు. సింపుల్ గా తన కాలితో కింద మట్టిని కాస్త ముందుకు తన్నింది. తన పక్కనుంచి మట్టి ఎగిసిపడటం చూసిన వ్యక్తి... ఇదేమిటా అని వెనక్కి తిరిగి చూశాడు. ఏనుగు కనబడటంతో భయపడి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. ఆ ఏనుగు హాయిగా తన దారిన తను వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్...
సోషల్ మీడియాలో వైరల్...
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఖాతాలో పోస్ట్ అయింది.
- ఈ వీడియోకు ఒక్క రోజులోనే ఐదు లక్షలకుపైగా వ్యూస్, వేల కొద్దీ లైకులు వచ్చాయి.
- అడవిలో ఉండే ఏనుగు ఎంత పద్ధతిగా వ్యవహరించిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆ ఏనుగు అతడిని భయపెట్టాలనుకోలేదు. కానీ తానే ఒక్కసారిగా భయపడ్డాడు...’ అంటూ కామెంట్లు వస్తున్నాయి.