జనసేనలో చేరనున్న మంచు మనోజ్, మౌనిక?

  • మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం
  • నంద్యాల కేంద్రంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం
  • ఈ ప్రచారంపై ఇంకా స్పందించని మనోజ్, మౌనిక
కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని చెపుతున్నారు. జనసేనలో వారు చేరుబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై మనోజ్ కానీ, మౌనిక కానీ ఇంకా స్పందించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



More Telugu News