తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్!

   
తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీనికి తోడు చలిగాలులు వేధిస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలాలో అత్యంత కనిష్ఠంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. 

ఇక, హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, గోల్కొండ, సఫిల్‌గూడ, హయత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


More Telugu News