కాకినాడ జిల్లాలో దారుణం... ముగ్గురు అన్నదమ్ముల హత్య

  • సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన
  • ఓ ఇంటి నిర్మాణం విషయంలో వివాదం
  • కత్తులతో ఓ కుటుంబంపై దాడి చేసిన ప్రత్యర్థులు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఓ ఇంటి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదం ముగ్గురు అన్నదమ్ముల ప్రాణాలను బలి తీసుకుంది. కాల్దారి ప్రకాశం, చంద్రరావు, ఏసుబాబు అనే అన్నదమ్ములు ప్రత్యర్థి వర్గం చేతిలో హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఇంటి నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. కత్తులతో వచ్చిన 20 మంది ప్రత్యర్థులు ఓ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అన్నదమ్ములు హతులయ్యారు.

కాగా, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో పడి ఉన్న కత్తులు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


More Telugu News