అమెరికాలో గ్రాండ్ గా 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్... అభిమానులు సిద్ధమా!
- రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
- 2025 జనవరి 10న గ్రాండ్ రిలీజ్
- అమెరికాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుతున్నామన్న దిల్ రాజు
- అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి చిత్రం తమదేనని వెల్లడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండడం గేమ్ చేంజర్ తోనే మొదలు అని చెప్పాలి. దీనిపై నిర్మాత దిల్ రాజు ఓ వీడియో విడుదల చేశారు. డిసెంబరు 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని అమెరికాలోని డాలస్ నగరంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు.
భారతదేశ సినీ చరిత్రలో అమెరికాలో ప్రీ రిలీజ్ కార్యక్రమం జరుపుకుంటున్న మొట్టమొదటి చిత్రం తమదేనని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, ఎస్.జె.సూర్య, అంజలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి తాను కూడా హాజరవుతున్నట్టు దిల్ రాజు వివరించారు. అందరం డాలస్ లో కలుసుకుందాం అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు.
కాగా, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రాజేశ్ కల్లేపల్లి ఆధ్వర్యంలో చరిష్మా ఎంటర్టయిన్ మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. డాలస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ ఈ వేడుకకు వేదికగా నిలవనుంది.