ఇంటికి అల్లు అర్జున్.. ఫ్యామిలీ భావోద్వేగం.. భార్యాబిడ్డలను హత్తుకొని బన్నీ ఎమోషనల్!
- చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్
- మొదట గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లి అక్కడి నుంచి ఇంటికి
- ఇంటికి చేరుకున్న బన్నీని చూసి భావోద్వేగానికి గురయిన ఫ్యామిలీ
- మరోసారి రేవతి ఫ్యామిలీకి సానుభూతి తెలిపిన ఐకాన్ స్టార్
- క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ బన్నీ ధన్యవాదాలు
సంధ్య థియేటర్ ఘటనలో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ మొదట గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న బన్నీని చూసి ఆయన ఫ్యామిలీ భావోద్వేగానికి గురయ్యారు. మొదట కుమారుడు అల్లు అయాన్ పరిగెత్తుకు వచ్చి తండ్రిని హత్తుకున్నాడు.
ఆ తర్వాత భార్య స్నేహ, కూతురు అర్హ, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా హత్తుకొని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఆయనకు దిష్టి తీశారు. అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్న బన్నీ, మరోసారి రేవతి ఫ్యామిలీకి సానుభూతి తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని అన్నారు.
ఇక 20 ఏళ్లుగా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నానని, ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. కోర్టులో కేసు ఉంది కనుక ఇంతకంటే మాట్లాడాలేనని బన్నీ అన్నారు. అలాగే తాను చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.