ఏపీలో డాక్టర్ పోస్టుల నియామకం... దరఖాస్తుల గడువు పెంపు

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు
  • దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకూ పొడిగించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువును వైద్య ఆరోగ్య శాఖ పెంచింది. దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పెంచుతూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ శుక్రవారం వెల్లడించారు. దరఖాస్తు గడువు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 97, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 280 భర్తీకి ఈ నెల 2న వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.  


More Telugu News