వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు నిరసన సెగ
- తాండూర్ లోని బాలికల వసతి గృహానికి వచ్చిన జిల్లా కలెక్టర్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీఆర్ఎస్ నేతలు
- మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైన 16 మంది బాలికలు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. తాండూర్ లోని గిరిజన బాలికల వసతి గృహంలో బాలికలకు వైద్య చికిత్స పరిశీలనకు జిల్లా కలెక్టర్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతరేకంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనారోగ్యానికి గురైన బాలికలకు ఆసుపత్రిలో చికిత్స అందించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. మూడు రోజుల క్రితం వసతిగృహంలో 16 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.